Holy Mass · పవిత్ర మిస్సా

సుప్రభాత వేళలో

14 views Telugu
Stage Mode: Font:
F Stage   Space Scroll   +/- Font size   Esc Exit
సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగ
సృష్టికర్త తండ్రి దేవుని ఆరాధింప - రక్షణ దాత క్రీస్తు ప్రభుని ప్రార్థింప వరప్రదాత పవిత్రాత్మ సర్వేశుని ప్రణుతింప - దైవ జనమా రారే త్రియేక దేవుని కొలువగ రారే సాసססస గరిపగరి సాసససస గరిపగరి - పాపපපప నిపసనిపగ పాపపపప నిపసనిపగ - పనిసరిగా గపనిసరి గాగరిసని రిరిసనిప సాసనిపగా - రిగపనిస గపనిస పనిస
సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగ గుడిగంటలు మ్రోగే ప్రభు పూజకు రమ్మని ||2|| ఆ జీవదాతను కొలువగ నేడే - పరిమళాల నవ సుమాల మాలలతో కదలి రండి తరలి రండి వేవేగమే ||2|| ||సుప్రభాత||
ఆదాము పాపము తను బాపుటకు - అరుదెంచెను ఆ దైవమే మూసియున్న స్వర్గద్వారములు తెరచుటకు - తానాయెను బలి గొఱ్ఱెపిల్ల ||2|| కల్వరి బలి వేదికపై అర్పించె యాగబలి ||2|| ఆ దివ్య బలికి శుభ సమయమిదే - మచ్చలేని స్వచ్చమైన హృదయాలతో కదలి రండి తరలి రండి వేవేగమె ||2|| ||సుప్రభాత||
అపవాది దాస్యమున మన విడుదలకు - తను చెల్లించే రక్తమూల్యము పరలోక తండ్రి దరికి మనలను చేర్చ - నూతన పాస్కగ తను మారెను ||2|| యాజకుడు అర్పించే ఈ దివ్య పీఠముపై ||2|| శాంతి దూత అతడు వేంచేయును - మరువలేని మధురమైన గీతికతో పాడరండి కొలువగ రండి వేవేగమె ||2|| ||సుప్రభాత||
Auto Scrolling